Wednesday, January 22, 2025

గృహలక్ష్మీ పథకం రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గత ప్రభుత్వ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని ఉపసంహకరిస్తూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జివో జారీ చేసింది. గృహలక్ష్మీ పథకం కింద నాలుగు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఆర్థిక సహాయం(100 శాతం సబ్సిడితో) అందజేసేందుకు గత ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు సంబంధించి 2,12,095 మంది లబ్దిదారులకు శాం క్షన్ ఆర్డర్లను ఆయా జిల్లా కలెక్టర్లు మంజూరు చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట జాగా వున్న పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేనివారికి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో వున్న గృహలక్ష్మీ పథకాన్ని ఉపంసహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News