హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదుగంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా దళితబంధు, గృహలక్ష్మీ పథకం, పోడు భూముల ఇళ్ల పట్టాలపై చర్చించడంతో పాటు రెండో విడత దళితబంధు, జీఓ 58,59 దరఖాస్తులకు మరో అవకాశం, దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, కాశీ, శబరిమలలో రూ. 50కోట్ల నిధులతో వసతి గృహాల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్ లోతైన చర్చ జరపడంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అయితే మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీష్‌రావు విలేకరులకు వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో మొదటి దఫాలో గొర్రెల పంపిణీ పూర్తిగా జరిగిందని, మొత్తంగా రాష్ట్రంలో 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించా మని, ఇందులో 50శాతం పంపిణీ గతంలో పూర్తయ్యిందని ఆయన తెలిపారు. మిగతా 50 శాతం మందికి గొర్రెల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించి, రూ.4,463కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.
రెండో విడత గొర్రెల పంపిణీ ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు. 7.31 లక్షల యూనిట్లలో గతంలోనే కొన్ని యూనిట్లు మంజూరవ్వగా మిగతా లబ్ధిదారులకు ఆగస్టు నాటికి పంపిణీ చేస్తామని, ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. పారదర్శకంగా, వేగవంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కేబినెట్ అభిప్రాయపడిందని హరీశ్‌రావు వివరించారు.
4 లక్షల ఎకరాలు… 1,55,393 మంది గిరిజనులు….
పొడు భూముల సమస్య చాలా ముఖ్యమైన సమస్యఅని, గతంలోనే సిఎం కెసిఆర్ శాసనసభలో ఈ సమస్య గురించి ప్రకటించారని ఆయన తెలిపారు. అటవీశాఖ అధికారులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాలను, 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇప్పటివరకు 1, 55, 393 మందికి 4 లక్షల 903 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ప్రింటయ్యాయని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని హరీష్‌రావు తెలిపారు. 4 లక్షల ఎకరాల పంపిణీ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని, ఎక్కడైనా మిగిలినవి ఉంటే వారికి సైతం పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే వారికి ‘గృహలక్ష్మీ’ పథకం
సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే వారి కోసం ‘గృహలక్ష్మీ’ పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అంతే కాకుండా 43వేల ఇళ్లను రాష్ట్ర కోటాలో పెట్టాలని నిర్ణయించామని, నాలుగు లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.3లక్షలు గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించామని,
ఈ రూ.3లక్షలను మూడు దఫాలుగా ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఒక్కో దఫాలో రూ.లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. లబ్ధిదారుడు తన ఇంటిని తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయం తీసుకున్నా మన్నారు. గృహలక్ష్మి పథకం కింద 4లక్షల ఇళ్లను మంజూరు చేస్తూ సిఎం కెసిఆర్, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించుకున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
మహిళల పేరు మీదే పథకం…
మంజూరు చేసే ఇళ్లన్నీ ఆ ఇంటికి సంబంధించిన మహిళలపైనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హరీష్‌రావు పేర్కొన్నారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఇచ్చిన రూ.40వేలు, రూ.60వేలల్లో అప్పులు ఉండేవని, గతంలో అప్పులన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హరీష్‌రావు తెలిపారు. దాదాపు రూ.4వేల కోట్లు పేదలపై అప్పులుంటే ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో పేదల వర్గాలు కట్టుకున్న ఇళ్లను మాఫీ చేయడమే కాకుండా ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్న 4లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.
త్వరలో రెండో విడత దళితబంధు
త్వరలో రెండో విడత దళితబంధు పథకాన్ని చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దళితబంధు కింద 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారని హరీష్‌రావు తెలిపారు. ఈ పథకం ఆగష్టు 16వ తేదీ, 2021న ప్రారంభం కాగా ప్రతి సంవత్సరం ఆగష్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
మరో 118 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు
ఇప్పటికే హుజూరాబాద్‌లో వందశాతం లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించామని మంత్రి తెలిపారు. మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించనుండగా మరో 200 మందికి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందచేస్తామని ఆయన తెలిపారు. మొత్తం 1.30లక్షల మందికి ఈ పథకాన్ని అందిస్తామన్నారు. గతంలో దళితబంధు అందించే ప్రక్రియ గతంలో ఎలా అయితే కలెక్టర్ల ద్వారా జరిగిందో ఈ సారి కూడా అదేవిధంగా జరిగేలా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులతో పాటు సిఎస్‌ను ఆదేశించామని హరీశ్‌రావు వివరించారు.
రూ.40వేలు, రూ.60వేలల్లో అప్పులు ఉండేవని, గతంలో అప్పులన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హరీశ్‌రావు తెలిపారు. దాదాపు రూ.4వేల కోట్లు పేదలపై అప్పులుంటే ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో పేదల వర్గాలు కట్టుకున్న ఇండ్ల రుణాలను మాఫీ చేయడమే కాకుండా, ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్న 4లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.
జిఓ 58 కింద మరోసారి దరఖాస్తులకు అవకాశం
ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఆయా ఇళ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించిందన్నారు. కటాప్ తేదీ నెల రోజుల పాటు సడలింపు ఇవ్వాలని సిఎం కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుందని హరీష్‌రావు తెలిపారు. జీఓ 58,59 కింద కొద్ది మంది మిగిలిపోయిన వారు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయామని, కటాఫ్ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, తమ ఇళ్లపై హక్కులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకొని సిఎం కెసిఆర్ ఎంతో ప్రేమతో వారికి చివరిసారిగా అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. జీఓ 58 కింద ఒక్క రూపాయి లేకుండా పేదలకు ఇళ్లపై హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు జీఓ 58 కింద 1,45,668 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన వాటిని వాటిని దృష్టిలో పెట్టుకొని చివరిసారిగా ముఖ్యమంత్రి నెల రోజులపాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారన్నారు.
59 జీఓ కింద 42వేలమంది లబ్ధి
జిఓ 59 కింద దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు హక్కులు కల్పించాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. అలాగే 59 జీఓకు సంబంధించి 42వేలమంది లబ్ధిపొందారని ఆయన తెలిపారు. కటాఫ్ తేదీ గతంలో 2014లో తేదీగా ఉండేదని, దానిని 2020 సంవత్సరానికి పెంచామని ఆయన పేర్కొన్నారు. ఆ లోపు ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే వారికి కూడా జీఓ 59 కింద హక్కులు కల్పించి, పేదల జీవితాల్లో ఉత్సాహం, ఆనందం నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద న్నారు. దీనికి సంబంధించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పట్టాలను వారి ఇళ్లకు వెళ్లి ఉచితంగా ఇస్తున్నామని హరీశ్‌రావు వివరించారు.
త్వరలో రెండో విడత దళితబంధు
త్వరలో రెండో విడత దళితబంధు పథకాన్ని చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దళితబంధు కింద 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారని హరీష్‌రావు తెలిపారు. ఈ పథకం ఆగష్టు 16వ తేదీ, 2021న ప్రారంభం కాగా ప్రతి సంవత్సరం ఆగష్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
మరో 118 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు
ఇప్పటికే హుజూరాబాద్‌లో వందశాతం లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించామని మంత్రి తెలిపారు. మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించనుండగా మరో 200 మందికి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందచేస్తామని ఆయన తెలిపారు. మొత్తం 1.30లక్షల మందికి ఈ పథకాన్ని అందిస్తామన్నారు. గతంలో దళితబంధు అందించే ప్రక్రియ గతంలో ఎలా అయితే కలెక్టర్ల ద్వారా జరిగిందో ఈ సారి కూడా అదేవిధంగా జరిగేలా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులతో పాటు సిఎస్‌ను ఆదేశించామని హరీశ్‌రావు వివరించారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. లక్షలాది మంది దళితుల మధ్య అంబేడ్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తా మని హరీశ్ రావు తెలిపారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో మొదటి దఫాలో గొర్రెల పంపిణీ పూర్తిగా జరిగిందని, మొత్తంగా రాష్ట్రంలో 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించా మని, ఇందులో 50శాతం పంపిణీ గతంలో పూర్తయ్యిందని ఆయన తెలిపారు. మిగతా 50 శాతం మందికి గొర్రెల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించి, రూ.4,463కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు. 7.31 లక్షల యూనిట్లలో గతంలోనే కొన్ని యూనిట్లు మంజూరవ్వగా మిగతా లబ్ధిదారులకు ఆగస్టు నాటికి పంపిణీ చేస్తామని, ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. పారదర్శకంగా, వేగవంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కేబినెట్ అభిప్రాయపడిందని హరీశ్‌రావు వివరించారు.
4 లక్షల ఎకరాలు… 1,55,393 మంది గిరిజనులు….
పొడు భూముల సమస్య చాలా ముఖ్యమైన సమస్యఅని, గతంలోనే సిఎం కెసిఆర్ శాసనసభలో ఈ సమస్య గురించి ప్రకటించారని ఆయన తెలిపారు. అటవీశాఖ అధికారులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాలను, 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇప్పటివరకు 1, 55, 393 మందికి 4 లక్షల 903 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ప్రింటయ్యాయని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని హరీష్‌రావు తెలిపారు. 4 లక్షల ఎకరాల పంపిణీ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని, ఎక్కడైనా మిగిలినవి ఉంటే వారికి సైతం పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాశీ, శబరిమలలో వసతిగృహాలు
కాశీ, శబరిమలల్లో రాష్ట్ర భక్తుల కోసం భవనాలను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రం నుంచి కాశీ, శబరిమల యాత్రలకు ప్రజలు భారీగా వెళ్తుతున్నారని వారి సౌకర్యార్ధం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. కాశీలో వసతి గృహ సముదాయం కోసం రూ.25 కోట్లు, శబరిమలలో వసతి గృహం కోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన బాధ్యతలు సిఎంఓ అధికారిణి ప్రియాంకవర్గీస్ అప్పగించినట్టు ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు శబరిమలలో తెలంగాణ ప్రభుత్వానికిఇ స్థలం ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని అందులో భాగంగా ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే శబరిమలలో మంత్రుల బృందం పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు.