Monday, December 23, 2024

నగర నిరుపేదలకు మరో శుభవార్త

- Advertisement -
- Advertisement -

ధరఖాస్తులు స్వీకరణ
ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని నిరుపేదలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సొంత ఇంటి స్థలం ఉంటి పక్కా ఇళ్లు లేని వారికి రెండు పడకలతో కూడిన ఇంటికి నిర్మించుకునేందుకు గృహాలక్ష్మి పథకం ద్వారా చేయూతను అందిస్తోంది. తద్వారా తెలంగాణలోని అర్హులైన వారందరికీ వారి స్వంత ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రధాన లక్షంగా ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాన్ని వివాహిత మహిళలు, వితంతులకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఎంపికైన లబ్దిదారులకు ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. లబ్దిదారులు పైసా చెల్లించాల్సిన పని లేదు. అంతేకాకుండా లబ్ధిదారులు వారికీ నచ్చిన విధంగా కట్టుకోవచ్చాని అయితే తప్పనిసరిగా మాత్రం ఆర్ సిసి నిర్మాణంలో రెండు గదులు, టాయిలెట్ ఉండేటట్లు కట్టుకోవడంతోపాటు ఆర్ధిక సహాయం పొందిన ప్రతి ఇంటికి గృహలక్ష్మి లోగో అమర్చుకోవాల్సి ఉంటుంది.

ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.3లక్షలను లక్ష చోప్పున 3 వాయిదాల రూపంలో ఆర్ధిక సహయాన్ని అందించనున్నారు. ఇందులోభాగంగా బేస్మెంట్ లెవెల్ స్టేజ్‌లో మొదటి లక్ష రూపాయాలు, రూఫ్ లేడ్ స్టేజ్ వద్ద మరో లక్ష, ఇంటినిర్మాణం చివరి దశలో మిగిత లక్ష రూపాయాలను లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు సంబంధించి లబ్దిదారురాలి పేరుతో జనధన్ ఖాతా తప్పక కలిగి ఉండాలి.

గృహాలక్ష్మి పథకానికి అర్హతలు ః దరఖాస్తుదారు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు వివాహిత మహిళలు లేక వితంతువు అయి ఉండాలి.దరఖాస్తుదారురాలు ఇంటి నిర్మాణం కోసంస్థలంలో తన భాగాన్ని కలిగి ఉండాలి.
కావాల్సిన పత్రాలు ః ధరఖాస్తు ఫారంతో పాటు తెలంగాణ నివాస రుజువు ధృవీకరణ పత్రం, లబ్ధిదారుడి ఆధార్ కార్డ్/ ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్‌ఫోటో సైజు ఫోటోగ్రాఫ్, బ్యాంక్ ఖాతా వివరాల జిరాక్స్ కాపీలతో పాటు మొబైల్ నంబర్‌ను పొందపర్చాల్సి ఉంటుంది.

గృహాలక్ష్మి పథాకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్ అనుదీప్

సొంతింటి స్థలం ఉండి పక్కా ఇళ్లు లేని నిరుపేద మహిళలు, వితంతువులు గృహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. గృహలక్ష్మి పథకం దరఖాస్తులు స్వీకరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్దిదారులు ఆహార భద్రతా కార్డు, స్వంత ఇండ్ల స్థలం ఉన్నవారు, లబ్ధిదారుడు నివాసముండే ప్రాంతానికి సంబంధించిన ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఉండాలని అన్నారు. ఈ పథకానికి అప్పటికే ఆర్ సిసి రూఫ్ తో ఇల్లు ఉన్నవారు, జి ఓ 59 క్రింద లబ్ది పొందిన వారు అర్హులు కారని తెలిపారు. ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు గృహలక్ష్మి పోర్టల్ లో 3 స్టేజిలలో అంటే బేస్ మెంట్ లెవెల్, రూఫ్ స్టేజి, పూర్తైన తరువాత ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. పథకం కింద అందజేయనున్న రూ.3లక్షలను మూడు స్టేజీలలో ప్రతి స్టేజికి 1 లక్ష చొప్పున జమ చేస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారుడు ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సూచించారు. రూ. 3లక్షలను ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారులు నయా పైసా చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News