Thursday, January 30, 2025

ఇస్రోకు వందనం

- Advertisement -
- Advertisement -

ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం సక్సెస్
నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లిన
జిఎస్‌ఎల్‌విఎఫ్15 రాకెట్ నిర్ణీత కక్షలోకి
రెండోతరం నేవిగేషన్ ఉపగ్రహం
ఎన్‌విఎస్02 వచ్చే ఐదేళ్లలో మరో వంద
రోదసీ ప్రయోగాలు చేస్తాం: ఇస్రో చైర్మన్

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వం దవ ప్రయోగం మైలురాయి సాధించేందుకు 46 సంవత్సరాలు పట్టింది. కానీ మరింత శీఘ్రంగా అంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో రెండవ సెంచరీ సాధించగలమన్న ధీమాతో ఇస్రో ఇప్పు డు ఉంది. బుధవారం తన వందవ ప్రయోగం ‘జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 15/ఎన్‌విఎస్ 02 ఉపగ్రహ ప్రయోగాన్ని పర్యవేక్షించిన సంస్థ చైర్మన్ వి నారాయణన్ అంతరిక్ష సంస్థ ఐదు సంవత్సరా ల్లో 200 మైలురాయిని అధిగమించగలదనే దృఢవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో వంద ప్రయోగాలు జ రపడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు నారాయణన్ అవునని సమాధానం ఇచ్చారు. ‘మీరు సరైన ప్రశ్న అడుగుతున్నారు. అది సా ధ్యమే’ అని ఆయన చెప్పారు.

అయితే, ఆయన ఇంకా వివరించలేదు. ఇస్రో బుధవారం ఒక సరికొత్త మైలురాయిని చేరుకున్నది. రెండవ తరం నేవిగేషన్
ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది వందవ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎఫ్ 15 (జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 15 తాను మోసుకువెళ్లిన ఎన్‌విఎస్02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తరువాత 322.33 కిలో మీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 100 ప్రయోగాల్లో ఆరు తరాలకు చెందిన 548 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలియజేశారు. వాటి మొత్తం బరువు 120 టన్నులని ఆయన తెలిపారు. వాటిలో 433 విదేశీ ఉపగ్రహాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో మూడు చంద్రయాన్ మిషన్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య ఎల్1, ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలు, నేవిగేషన్, భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఉన్నాయని నారాయణన్ వివరించారు. కాగా, తాజాగా కక్షలో ప్రవేశపెట్టిన ఎన్‌విఎస్02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్‌కు ఇది మొదటి ప్రయోగం. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ మొదలైన సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News