Monday, January 27, 2025

జిఎస్‌ఎల్‌విఎఫ్ 15 ఏకీకరణ పూర్తి

- Advertisement -
- Advertisement -

ప్రయోగానికి సిద్ధం : ఇస్రో
బెంగళూరు : ఎన్‌విఎస్02 ఉపగ్రహంతో జిఎస్‌ఎల్‌విఎఫ్ 15 రాకెట్ సంలీనం పూర్తి అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం వెల్లడించింది. దేశీయ క్రయోజెనిక్ దశతో జిఎస్‌ఎల్‌విఎఫ్ 15 రాకెట్ ఎన్‌విఎస్02 ఉపగ్రహంతో ఈ నెల 29న ప్రయోగానికి సిద్ధమైందని ఇస్రో తెలియజేసింది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 100వ ప్రయోగం. జిఎస్‌ఎల్‌విఎఫ్15 జియోసింక్రనస్ బదలీ కక్షలో ఎన్‌విఎస్02 ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుందని, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండవ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం జరుగుతుందని ఇస్రో తెలిపింది. రెండవ తరం ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్‌విఎస్01న 2023 మే 29న జిఎస్‌ఎల్‌విఎఫ్12 రాకెట్ సాయంతో ప్రయోగించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News