Monday, January 20, 2025

జీస్క్వేర్‌ బ్రాండ్‌ అంబాసిడర్ గా ఎంఎస్‌ ధోనీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మరియు అనుభజ్ఞుడైన ప్లాట్‌ ప్రమోటర్‌, జీస్క్వేర్‌ తాము క్రికెటింగ్‌ లెజండ్‌ మహేంద్ర సింగ్‌ ధోనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఎంఎస్‌ ధోనీతో ఈ భాగస్వామ్యంతో దక్షిణ భారత నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరులలో వారి ప్రగతిశీల మరియు శక్తివంతమైన వృద్ధి వ్యూహం పునరుద్ఘాటిస్తుంది.

ఈ గ్రూప్‌కు భారతదేశంలో ఇతర నగరాలలో సైతం రియల్‌ ఎస్టేట్‌ను విస్తరించే లక్ష్యం ఉంది. దాదాపు 10 సంవత్సరాల అనుభవం కలిగిన జీస్క్వేర్‌ బృందానికి రియల్‌ ఎస్టేట్‌ రంగం పట్ల అపార అనుభవం ఉంది. వీరు విజయవంతంగా భారీ స్ధాయి ప్రాజెక్ట్‌లను అత్యున్నత స్ధాయి వినియోగదారుల సంతృప్తితో పూర్తి చేశారు. ఇప్పటి వరకూ ఈ కంపెనీ 60 కు పైగా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. దాదాపు 6000 మందికి పైగా వినియోగదారులు సంస్థకు ఉంది. ఈ సంఖ్య స్ధిరంగా వృద్ధి చెందుతూనే ఉంది. దక్షిణ భారతదేశంలో తమ వినియోగదారులకు 1000 కు పైగా ఎకరాల భూమిని అభివృద్ధి చేసి అందజేసింది. ఇప్పుడు తెలంగాణా ప్రజలకు సైతం ప్రీమియం ప్రాజెక్టులను జీస్క్వేర్‌ అందిస్తుంది.

జీస్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ.. ‘‘ఆధునిక యుగపు విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌ మరియు నాయకునితో కలిసి పనిచేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఎంఎస్‌ ధోనీ లాంటి లెజెండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో మా వ్యాపారాన్ని పలు ప్రాంతాల వ్యాప్తంగా విస్తరించడానికి మరియు జీస్క్వేర్‌ను సుప్రసిద్ధ ప్లాట్‌ ప్రమోటర్‌గా నిలపడానికి, మా బ్రాండ్‌ను బలోపేతం చేయడానికి సహాయపడనుంది’.

GSquare appoints MS Dhoni as brand ambassador

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News