Monday, December 23, 2024

జూలైలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

GST collection in July was Rs.1.49 lakh crore

ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పెరిగిన ఆదాయం

న్యూఢిల్లీ : జూలై నెలలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గత నెలలో రూ.1,48,995 కోట్ల జిఎస్‌టి వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన జిఎస్‌టి ఆదాయంలో ఇది రెండో అత్యధికం కావడం గమనార్హం. జూన్ నెలలో జిఎస్‌టి ఆదాయం రూ.1,44,616 కోట్లుగా ఉంది. ఇక 2022 ఏప్రిల్‌లో జిఎస్‌టి వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1,67,540 కోట్లు వచ్చాయి. దీని తర్వాత జూలైలో అత్యధిక జిఎస్‌టి వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాది 2021 జూలైతో పోలిస్తే 2022 జూలైలో జిఎస్‌టి వసూళ్లు 28 శాతం పెరిగాయి.

గతేడాది జూలైలో జిఎస్‌టి వసూళ్లు రూ.1,16,393 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022 జూలైలో రూ.1,48,995 కోట్ల జిఎస్‌టి వసూళ్లలో కేంద్రం జిఎస్‌టి రూ.25,751 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టి రూ.32,807 కోట్లు ఉంది. ఉమ్మడి జిఎస్‌టి రూ.41,420 కోట్లు ఉండగా, దీనిలో వస్తువుల దిగుమతుల ద్వారా రూ.79,618 కోట్ల వసూళ్లు వచ్చాయి. సెస్సు వసూళ్ల వాటా రూ. 10,920 కోట్లు ఉంది. 2017 జూలై 1న జిఎస్‌టిని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత జిఎస్‌టి వసూళ్లలో ఇది రెండవ అత్యధిక సంఖ్య, అలాగే జిఎస్‌టి వసూళ్లు రూ. 1.4 లక్షలపైన నమోదు కావడం ఇది వరుసగా ఐదవ నెల కావడం గమనార్హం.

ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి..

జిఎస్‌టి ఆదాయం గత సంవత్సరం 2021 జూలైతో పోలిస్తే ఇప్పుడు 35 శాతం ఎక్కువగా ఉంది. అలాగే జిఎస్‌టి కౌన్సిల్ తీసుకున్న వివిధ చర్యల కారణంగా అమలు ప్రక్రియ సజావుగా జరుగుతోంది. మెరుగైన రిపోర్టింగ్‌తో పాటు ఆర్థిక పునరుద్ధరణ జిఎస్‌టి వసూళ్లపై సానుకూల ప్రభావం చూపుతోంది. జిఎస్‌టి ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, ముఖ్యంగా నకిలీ బిల్లుల తయారీదారులపై చర్యలు తీసుకోవడం వల్ల జిఎస్‌టి వసూళ్లు పెరగడానికి దోహదం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News