Monday, December 23, 2024

మేలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

GST collection in May stood at Rs 1.41 lakh crore

ఏప్రిల్‌తో పోలిస్తే తగ్గుముఖం

న్యూఢిల్లీ : మే నెలలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు వార్షికంగా 44 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో రూ.1.41 లక్షల కోట్లు నమోదు చేశాయి. అయితే జిఎస్‌టి ఆదాయం ఏప్రిల్‌లో వచ్చిన రికార్డు స్థాయి వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఇక మార్చి నెలలో జిఎస్‌టి ఆదాయం రూ.1.42 లక్షల కోట్లు వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరిలో రూ.1.33 లక్షల కోట్లు, జనవరిలో రూ.1.40 లక్షల కోట్లు ఉంది.

కేంద్రం జిఎస్‌టి రూ.25,036 కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 మే నెలలో స్థూల జిఎస్‌టి ఆదాయం రూ.1,40,885 కోట్లు నమోదైంది. దీనిలో కేంద్రం జిఎస్‌టి రూ.25,036 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టి రూ.32,001 కోట్లు, ఐ జిఎస్‌టి రూ.73,345 కోట్లు (రూ.37,469 కోట్ల దిగుమతి పన్నులతో కలిపి) వచ్చింది. సెస్ రూ.10,502 కోట్లు (దిగుమతిపై పన్ను వసూళ్లు రూ.931 కోట్లతో కలిపి) నమోదైంది. 2021 మే నెలలో జిఎస్‌టి ఆదాయం రూ.97,821 కోట్లతో పోలిస్తే 2022 మేలో ఇది 44 శాతం వృద్ధిని సాధించింది.

నాలుగోసారి రూ.1.40 లక్షల కోట్ల మార్క్

జిఎస్‌టి ప్రారంభించినప్పటి నుంచి ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం ఇది నాలుగోసారి, అయితే 2022 మార్చి నుంచి వరుసగా మూడు నెలలు ఈ మార్క్‌ను దాటడం గమనార్హం. ‘2022 మే నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం ప్రోత్సహకరమైన విషయం’ అని మంత్రిత్వశాఖ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News