Wednesday, January 22, 2025

సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెప్టెంబర్‌లో జిఎస్‌టి(వస్తు సేవల పన్ను) ద్వారా ప్రభుత్వం రూ. 1.63 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది(2022) సెప్టెంబర్‌లో రూ.1.47 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పుడు 10.2 శాతం ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. నెల క్రితం 2023 ఆగస్టులో ప్రభుత్వం రూ.1.59 లక్షల కోట్ల జిఎస్‌టి వసూలు చేయగా, జూలైలో జిఎస్‌టి రూ.1.65 లక్షల కోట్లు వచ్చింది. వరుసగా 7వ సారి రూ.1.5 లక్షల కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అత్యధిక జిఎస్‌టి వసూళ్లు 2023 ఏప్రిల్‌లో రూ. 1.87 లక్షల కోట్లు దాటాయి. ఇది కాకుండా దేశ జిఎస్‌టి వసూళ్లు వరుసగా 19 నెలలుగా రూ.1.4 లక్షల కోట్లకు పైన నమోదు అయ్యాయి.

కేంద్రం జిఎస్‌టి రూ.29,818 కోట్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, 2023 ఆగస్టులో జిఎస్‌టి ఆదాయం రూ.1,62,712 కోట్లు నమోదైంది. దీనిలో సిజిఎస్‌టి రూ.29,818 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ.37,657 కోట్లు, ఐజిఎస్‌టి రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలైన రూ.41,145 కోట్లు కలిపి), సెస్ రూ.11,613 కోట్లు వచ్చాయి. సెస్‌లో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన రూ.881 కోట్లు ఉన్నాయి.
2023లో ఇప్పటివరకు రూ.8.3 లక్షల కోట్లు
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అంటే గత ఐదు నెలల్లో మొత్తం రూ. 9.93 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు వచ్చాయి. మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడితే, మొత్తం జిఎస్‌టి వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్ల పరంగా టాప్-5 రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News