Saturday, November 23, 2024

జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ ?

- Advertisement -
- Advertisement -

జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తేనున్న జిఎస్‌టి కౌన్సిల్

GST Council may consider bringing petrol, diesel under GST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే వస్తు,సేవల పన్ను(సింగిల్ జిఎస్‌టి) కింద పెట్రోల్, డీజిల్ పన్ను తెచ్చే విషయాన్ని జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం పరిశీలించనున్నది. ఇందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తుల పన్ను విధానంలో చాలా వరకు రాజీపడాల్సి ఉంటుంది.
లక్నోలో శుక్రవారం జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరుగనున్నది. జిఎస్‌టి కౌన్సిల్‌లో కేంద్ర,రాష్ట్రప్రభుత్వ ఆర్థిక మంత్రులు ఉంటారు. ఈ సమావేశంలో అత్యవసర సరకులకు కోవిడ్-19 పన్ను మినహాయింపును కూడా విస్తరించే అవకాశాన్ని పరిశీలించనున్నారు.
రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల సమస్యకు పరిష్కారం జిఎస్‌టియేనన్న భావన ఉంది. పన్నుపై పన్ను ప్రభావాన్ని ఇది అంతమొందించగలదని భావిస్తున్నారు( విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అనేది ఉత్పత్తి ఖర్చుపైనే కాకుండా, ఉత్పత్తిపై కేంద్రం విధించే ఎక్సైజ్ పన్నుపై కూడా పడుతుంటుంది).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News