Wednesday, January 22, 2025

వచ్చే నెల 7న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ 52వ సమావేశం అక్టోబర్ 7న జరుగనుంది. జిఎస్‌టి కౌన్సిల్ చివరి సమావేశం ఆగస్టు 2న నిర్వహించగా, ఈ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ 52వ సమావేశం అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగనుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో జిఎస్‌టి కౌన్సిల్ పేర్కొంది.

గత జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కాసినో, గుర్రపు పందాలు, ఆన్‌లైన్ గేమింగ్‌లపై జిఎస్‌టి చట్టానికి సవరణలు ఆమోదించారు. ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, క్యాసినోలపై 28 శాతం జిఎస్‌టిని కౌన్సిల్ ఆమోదించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా, జిఎస్‌టి పన్ను రేట్లపై కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. గత ఏడాది ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై జిఎస్‌టి రేట్లను పెంచడం లేదా ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై భారీగా 28 శాతం జిఎస్‌టి విధించాలనే ఇటీవల నిర్ణయం పట్ల వ్యతిరేకత వచ్చింది.

మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణంపై పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా, జిఎస్‌టి రేట్లను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిఎస్‌టి విషయంలో ప్రభుత్వం ఊహించని విధంగా కొంత ఊరట కలిగించవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News