ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పరిహారం కింద రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం నిధులు రూ.44 వేల కోట్ల విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో నష్టాల భర్తీ కోసం బహిరంగా మార్కెట్ నుంచి సేకరించిన రుణాలను యధావిధిగా పరిహారం రూపంలో రాష్ట్రాలకు చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తెలంగాణకు రూ.1264.78 కోట్లు, ఎపికి రూ.905.59 కోట్లు ఇచ్చినట్టు పేర్కొంది. 2021-22వ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పూర్తిగా రూ.1.59 లక్షల బకాయిలను పూర్తిగా చెల్లించింది. దీంతో తెలంగాణకు రూ.4569.49 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3272.19 విడుదల చేసినట్టు వెల్లడించింది. ఆదాయ భర్తీ కోసం కేంద్రం మూడు విడతలుగా నిధులు విడుదల చేసింది. జులై 15న రూ.75 వేల కోట్లు, అక్టోబర్ 7న రూ.40 వేల కోట్లు, ప్రస్తుతం రూ.44 వేల కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు రూ2.59 లక్షల కోట్ల నిధులు విడులు చేసినట్టు వెల్లడించింది. ప్రస్తుతం విడుదల చేసిన రూ.44 వేల కోట్లను ఐదేళ్ల కాలానికి 5.69 వడ్డీ రేటుతో సెక్యూరిటీల విక్రయం ద్వారా రుణం తీసుకుంది.
రాష్ట్రాలకు కేంద్రం జిఎస్‌టి పరిహారం….
- Advertisement -
- Advertisement -
- Advertisement -