- Advertisement -
ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ నెల 17న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరూతూ జీఎస్టీ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం అందింది. లక్నోలో జాతీయ జీఎస్టీకౌన్సిల్ 45వ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఈ నెల 16న అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రెండవ రోజుజరిగే కౌన్సిల్ సమావేశానికి సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి తరుణ్ బజాజ్ శనిశారం నాడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం పంపారు.
- Advertisement -