Thursday, January 23, 2025

రైలు టికెట్, హోటల్ బుకింగ్.. రద్దు చేసుకున్నా జిఎస్‌టి

- Advertisement -
- Advertisement -

GST on Hotel Booking and Railway Ticket Cancellation

ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ

న్యూఢిల్లీ: పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు జీఎస్టీ రూపంలో కొత్త బెడద ఎదురుకానుంది. సంవత్సరం పొడవునా దేశం నలుమూలలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. సీటు కోసం ముందుగానే రిజర్వేషన్ చేయించుకుని టికెట్లు బుక్ చేసుకుంటారు. పండుగల సీజ న్లో ట్రైన్ టికెట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ప్రయాణికులు తమ ప్లాన్‌ను మార్చుకోవడం లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం రద్దు చేసుకోవడం పరిపాటి. కన్ఫర్మ్ అయిన టికెట్లను క్యాన్సిల్ చేస్తే ఇండియన్ రైల్వే ఇప్పటివరకు క్యాన్సిలేషన్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇక నుంచి కన్ఫర్మ్‌డ్ టికెట్లు ను ప్రయాణికులు రద్దు చేసుకున్నా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) చెల్లించాల్సి ఈ మేర కు ఆర్థిక మంత్రిత్వశాఖ రిసెర్చ్ యూనిట్ ఆగస్టు 3న సరులర్ జారీ చేసింది. ఈ సరులర్ ప్ర కారం ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకున్నా అదేవిధంగా హోటల్ రద్దు చేసుకున్నా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ట్రైన్ టికెట్‌ను బుక్ చేయడం అనేది సర్వీస్ ప్రొవైడర్ సేవను అందిస్తానని హా మీ ఇచ్చే ఒప్పందంగా సరులర్‌లో పేర్కొన్నారు.

రైలు టికెట్‌ను రద్దు చేయడం ద్వారా ప్రయాణికులు ఒప్పందాన్ని ఉల్లంఘించినపుడు సర్వీస్ ప్రొవైడర్‌కు క్యాన్సిలేషన్ ఛార్జీగా చిన్నమొత్తంలో పరిహారం చెల్లించాలి. ఇది చెల్లింపుల పరిధిలోకి వస్తుంది కనుక ఇకనుంచి జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థికశాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఏసీ ఫస్ట్‌క్లాస్, ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్‌ను రైలు బయలుదేరే 48గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఇండియన్ రైల్వేస్ రూ.240 వసూలు చేస్తోంది. ఈ టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే ప్ర యాణికులు 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుం ది. ఆర్థిక మంత్రిత్వశాఖ కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రయాణికులు ఇదే మొత్తంలో క్యాన్సిలేషన్ ఛా ర్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ కన్ఫ ర్మ్ అయిన ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్‌ను ప్రయాణికుడు రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలు రూ. 240తోపాటు ఈమొత్తంలో 5శాతం రూ.12ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ టు టైర్ టికెట్ క్యాన్సిలేషన్‌కు రూ.200, ఏసీ త్రి టైర్ టికెట్‌కు రూ.180లను రైలు బయలుదేరే 48గంటల ముందు క్యాన్సిలేషన్ ఛార్జీలగా రైల్వేవిభాగం వసూలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News