Friday, November 15, 2024

ఏప్రిల్‌లో జిఎస్ టి వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్లకు…

- Advertisement -
- Advertisement -

 

gst

న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) వసూళ్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మార్చి 2022 నెలలో తెలిపిన రూ.1.42 లక్షల కోట్ల రెండవ అత్యధిక సేకరణ తర్వాత ఇది అధికం.  ఏప్రిల్ వసూళ్లు మార్చితో పోలిస్తే రూ.25,000 కోట్లు ఎక్కువ.

జిఎస్ టి  సేకరణలు:

ఏప్రిల్‌లో సేకరించిన స్థూల జిఎస్ టి  రూ. 1,67,540 కోట్లు అందులో  సిజిఎస్ టి  రూ. 33,159 కోట్లు, ఎస్ జిఎస్ టి  రూ. 41,793 కోట్లు,  ఐజిఎస్ టి  రూ. 81,939 కోట్లు మరియు సెస్ రూ. 10,649 కోట్లు.

ఏప్రిల్ 2022 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో జిఎస్ టి  రాబడి కంటే 20% ఎక్కువ. ఈ నెలలో, దిగుమతి వస్తువుల నుండి సేకరించిన ఆదాయం 30% ఎక్కువ మరియు దేశీయ లావాదేవీల నుండి సేకరించిన ఆదాయం 17% పెరిగింది. స్థూల జిఎస్ టివసూళ్లు రూ. 1.5 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఈ నెలలో అత్యధిక పన్ను వసూళ్లు ఏప్రిల్ 20, 2022న నమోదయ్యాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, “సమ్మతి ప్రవర్తనలో(కాంప్లియెన్స్ బిహేవియర్ లో) స్పష్టమైన మెరుగుదల ఉంది, ఇది పన్ను చెల్లింపుదారులను సకాలంలో రిటర్న్‌లను దాఖలు చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి మరియు కఠినమైన అమలు చర్యలను చేయడానికి టాక్స్ అడ్మినిస్ర్టేషన్  తీసుకున్న వివిధ చర్యలే కారణం.  డేటా అనలిటిక్స్,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తప్పులను గుర్తించి  పన్ను చెల్లింపుదారులపై నిక్కచ్చిగా చర్య తీసుకోబడింది” అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News