Wednesday, January 22, 2025

చేనేతపై జిఎస్‌టి రద్దు చేయాలి: సుద్దాల అశోక్ తేజ

- Advertisement -
- Advertisement -

GST should be abolished on handloom: Suddala Ashok Teja

మన తెలంగాణ, హైదరాబాద్ : చేనేత మీద కేంద్రం విధించిన జిఎస్‌టిని రద్దు చేయాలని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ డిమాండ్ చేశారు. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపుతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్టుకార్డును అశోక్ తేజ రాశారు. అలాగే చేనేతపై జిఎస్‌టిని తొలగించి చేనేత వృత్తిని కాపాడాలని ప్రధానమంత్రికి పోస్టు కార్డును పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య రాశారు. చేనేతపై విధించిన జిఎస్‌టిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డును చేనేత రంగంలో ఉపయోగపడే ఆసు యంత్రంను కనుగొన్న చింతకింది మల్లేశం రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News