Sunday, November 17, 2024

ఢిల్లీకి కీలకం..

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్‌తో పోరు

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీలకంగా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న డిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని త లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

విజయమే లక్షంగా..

లక్నతో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. గుజరాత్‌ను కూడా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. అయితే స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో పోటీలో తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారిం ది. మరో ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌లో ఉండడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతని పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వార్నర్‌తో కలిసి అతను శుభారంభం అందిస్తే జట్టు బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.

ఇక లక్నోపై యువ ఆటగాడు జాక్ ఫ్రెజర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిలోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కూ డా అతని నుంచి జట్టు అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపిస్తున్నా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించేందుకు సిద్ధమయ్యాడు. పంత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. ట్రిస్టన్ స్టబ్స్ కూడా నిలకడడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నా డు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాల ని భావిస్తున్నాడు. షాయ్ హోప్ రూపంలో మరో హార్డ్ హిట్టర్ జట్టులో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాఛిన్నం చేసే సత్తా అతనికుంది. దీంతో హోప్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కుల్దీప్ యాదవ్, ఖలీల్, అక్షర్, ముకేశ్, ఇషాంత్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు.

ఫేవరెట్‌గా టైటాన్స్..

మరోవైపు ఆతిథ్య గుజరాత్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించడంతో గుజరాత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింద.ఇ అంతేగాక వారం రోజుల పాటు ఆటగాళ్లకు విశ్రాంతి కూడా లభించింది. దీంతో వీరంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శు గిల్‌లు ఫామ్‌లో ఉన్నారు.

కెప్టెన్ గిల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాయి. సాయి సుదర్శన్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించక పోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దు కుంటే గుజరాత్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, షారుక్ ఖాన్, నూర్ అహ్మద్ తదితరులతో గుజరాత్ చాలా బలంగా ఉంది. దీనికి తోడు సొంత గడ్డపై పోరు కావడంతో గుజరాత్‌కు మరింత కలిసివచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News