నేడు గుజరాత్‌తో ఢీ
చండీగఢ్: ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో పంజాబ్ ఆశించిన రాణించలేక పోతోంది. ఏడు మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. వరుస ఓటముల నేపథ్యంలో జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలనే లక్షంతో పంజాబ్ పోరుకు సిద్ధమైంది. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ పోరాడి ఓడింది. అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్‌లు చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరచడంతో పంజాబ్ ఈ మ్యాచ్‌లో దాదాపు గెలిచినంత పని చేసింది. అయితే కీలక సమయంలో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని పంజాబ్ భావిస్తోంది. ఇక గుజరాత్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 89 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి స్థితిలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి. అయితే పంజాబ్‌తో పోల్చితే గుజరాత్ కాస్త బలంగా ఉందనే చెప్పాలి. శుభ్‌మన్, సాయి సుదర్శన్, సాహా, మిల్లర్, తెవాటియా, షారుక్, రషీద్ ఖాన్ తదితరులతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పంజాబ్‌కు కీలకం..
- Advertisement -
- Advertisement -
- Advertisement -