Sunday, December 22, 2024

గ్యారంటీ

- Advertisement -
- Advertisement -

ఐదుగురు సిఎంలు

ప్రజలకు అష్టకష్టాలు

మనతెలంగాణ/హైదరాబాద్:కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు డబ్బులు బాగా సంపాదించి,వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శా ఖ మంత్రి కె.టి.రామారావు ఆరోపించారు. డబ్బులిస్తే తీసుకోవాలని..ఓటు మాత్రం కారు గుర్తుకే వే యాలని ఓటర్లకు సూచించారు. కెటిఆర్ సమక్షం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షు డు కోనేరు చిన్న సత్యనారాయణ మంగళవారం తె లంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే సంక్షేమం వెనక్కి పోతుందని,రాజకీయ అస్థిరత తెలంగాణలో ఖాయమని అన్నారు. తెలివిలేని, ఆలోచన లేని, వ్యూహం లేని వాళ్ళు, డబ్బు సంచులతో దొరకిన వాళ్ళు ఇలాంటి హామీలు రాసిచ్చారని మండిపడ్డారు.

కర్ణాటకలో పవర్ హాలీ డే, కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని కెటిఆర్ తెలిపారు. అభివృద్దికి పైసలు లేవని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమర్ చెప్పారని తెలిపారు. కాం గ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కటిక చీక ట్లు, తాగునీటి ఇక్కట్లు, ఎరువులు, విత్తనాల కోసం కష్టాలు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. కాం గ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం గ్యారంటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు సిఎంలు, రాజకీయ అస్థిరత గ్యారంటీ అని కెటిఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీలని డైలాగులు కొట్టిన కాంగ్రెస్ అభివృద్ధిపై ఒక్కమాటైనా చెప్పిం దా..? అని కెటిఆర్ ప్రశ్నించారు.పేదలను మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలన్నఆలోచన తప్ప కాంగ్రెస్‌కు రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచన ఏదీ..? అని కెటిఆర్ నిలదీశారు. ఖమ్మంలో కొందరు బిఆర్‌ఎస్ టికెట్ దక్కలేదని పార్టీని వీడి వెళ్లారు…ఆ నాయకులు వాళ్ల బాధను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో నాలుగు రకరాలుగా చీలిపోయి అభివృద్ధికి దూరం కాకండి అని ప్రజలను కోరారు. కెసిఆర్ రైతుబంధు కావాలా.. కాంగ్రెస్ రాబందులు కావాలో తేల్చుకోలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సీతారాం ప్రాజెక్టుకు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.

అతిత్వరలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీరందిస్తామని వెల్లడించారు. ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేలు ఇస్తామని ఖమ్మంలో కొందరు కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారట… కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి అని ఓటర్లకు సూచించారు. ముల్లును ముల్లుతోనే తీయాలి.. మోసాన్ని మోసంతోనే జయించాలని కెటిఆర్ అన్నారు. రజాకార్ చిత్రంతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహిస్తే కేంద్రంలో ఉన్నవారికి నచ్చలేదని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బిజెపి పార్టీ తొమ్మిదేళ్లుగా ప్రజల్ని మోసగిస్తూనే ఉన్నాయని విమర్శించారు. మోడీ భ్రమల నుంచి ప్రజలు బయటపడుతున్నారని చెప్పారు. సింగరేణికి శత్రువు మోడీ అని విమర్శించారు. భద్రాచలంలో అయిదు మండలాలు ఎపిలో కలిపింది బిజెపి పార్టీని దుయ్యబట్టారు. బయ్యారం ఉక్కు కర్మాగారం చట్టంలో పెట్టి ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు.

కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ చేసిందేమీ లేదని, ఏదో రకంగా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. మతాల పేరిట రెచ్చగొట్టి పాత గాయాలను రేపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల మంటల్లో చిచ్చుపెట్టి చలి కాల్చుకోవాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో కేంద్రం ఏనాడూ తెలంగాణను ఆదుకోలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నరని మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిగ్గూ లజ్జ ఉంటే ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని సూచించారు. ధైర్యముంటే 18 కోట్ల ఉద్యోగాలేమయ్యాయని,కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వమని అడుగాలని డిమాండ్ చేశారు. ఇక్కడి బిజెపి దిక్కుమాలిన దందాలు, ధర్నాలు చేస్తోందని అన్నారు. గ్యాస్ ధరలు పెంచిన బిజెపికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News