Friday, November 15, 2024

ఉపాధికి భరోసా

- Advertisement -
- Advertisement -

భువనగిరి, గద్వాల సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ

మన తెలంగాణ/ యాదాద్రి భు వనగిరి ప్రతినిధి/గద్వాల్ ప్రతి నిధి: వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో మీరే తేల్చు కోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్‌రెడ్డికి మద్దతుగా భువనగి రి జిల్లా కేంద్రంలో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోట్ల రద్దు, కరోనా, జిఎస్‌టి వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డా రని అన్నారు. ట్రిపుల్ ఆర్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్‌ఆర్‌ఆర్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రియాంక హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అని ల్‌కుమార్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నామని తెలంగాణ రా ష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకా లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రజల కోసమే పనిచేశారని గుర్తు చేశారు. నా కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల బాధ ఏమిటో తనకు తెలుసని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఉద్యమాల్లో అమరులైన వారి త్యాగం వృథా కాకూడదని, అమరుల ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని ప్రియాంక సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యంపై క్వింటాల్‌కు రూ. 500 రూపాయల బోనస్‌తోపాటు రైతులందరికీ రుణమాఫీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుంభం కీర్తిరెడ్డి, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం
ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రియాంకగాంధీ అన్నారు. సోమవారం గద్వాలలో జరిగిన ప్రజా గర్జన సభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎందరో విద్యార్థులు, యువకులు బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు. బిజెపి, ఎంఐఎం పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదనంతో వారి స్నేహితులకు దోచి పెట్టారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పి హామీలు ఇచ్చే నాయకులను నమ్మరాదని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. కర్ణాటకలో 5 పథకాలు అమలు అయ్యాయని తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని అన్నారు. వక్ఫ్ భూములను చేసిన వారిని గుర్తించి పరిరక్షిస్తామని తెలిపారు. చేనేత పార్కు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా గద్వాల అభ్యర్థి సరిత ప్రియాంకగాంధీ మాటలను తెలుగులోకి అనువాదం చేసి వినిపించారు. ఈ కార్యక్రమంలో మాణిక్ ఠాక్రే , గద్వాల అభ్యర్థి సరిత, తీర్మార్ మల్లన్న, సంపత్‌కుమార్, బండ్ల చంద్రశేకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News