Saturday, November 23, 2024

కర్నాటకలో కరెంటు కష్టాలు

- Advertisement -
- Advertisement -

విద్యుత్ సంక్షోభంలో వ్యవసాయం రంగం
7 గంటలు ఇస్తామన్న హామీని విస్మరించిన ప్రభుత్వం
ఎన్నికల హామీని అమలు చేయాలని అన్నదాతల ఆందోళన
మొసళ్లతో విద్యుత్ కార్యాలయాల వద్ద రైతులు నిరసన
కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని నాలుగు రాష్ట్రాల ప్రజలకు కర్నాటక అన్నదాతల సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికల జరిగిన హామీలు వర్షం కురిస్తూ ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎత్తులు జిత్తులు వేస్తుందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మూడు నెలకితం జరిగిన కర్నాటక ఎన్నికల్లో అమలు కానీ హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి అధికార చేపట్టిన తరువాత హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులకు 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రగ్భలాలు పలికి ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు రోజుకు కనీసం 4 గంటలు కరెంటు సరఫరా చేయలేని పరిస్దితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వ ఆఫీసులను ముట్టడించి నిరసన తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు మొసళ్లను తీసుకొచ్చి విద్యుత్ కార్యాలయంలో వదిలి ఆందోళన తెలిపారు.

రైతులు రోడ్డుపైకి వచ్చిన కర్నాటక ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ , ప్రియాంక వచ్చి మాట తప్పం, మడమ తిప్పమని సూక్తులు వచ్చిన తమను మోసగించారని, నవంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బొల్తా కొట్టే పనిచేస్తారని ఆయా రాష్ట్రాల ప్రజలు కల్లిబొల్లి కబుర్లకు వినకుండా ప్రజల సంక్షేమానికి పాటు పడే పార్టీలకు అధికారం కట్టబెట్టాలని కర్నాటక రైతులు సూచించారు. దక్షిణాది ప్రాంతమైన తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల సమరం ఉండటంతో హస్తిన కాంగ్రెస్ నేతలంతా తెలంగాణపై గుంపులుగా చొరబడి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు ఇస్తామని వేదికలపై ప్రసంగాలు దంచుతూ ప్రజలను బుట్టలో వేసుకునేందుకు జిమ్మక్కులు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు వారి మోసపూరిత మాటలు నమ్మవద్దని అధికార బిఆర్‌ఎస్ నేతలు కోరుతున్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో కోసం 14 ఏళ్లు పోరాటం చేసి గులాబీ పార్టీ రెండు పర్యాయాలు అధికారం చేపట్టి అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, పేదలకు ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రకటన చేసిన అభివృద్దిలో దూసుకపోతుంది. మూడోసారి జరిగే ఎన్నికల్లో అడ్డుగోలు హమీలిచ్చే పార్టీల మాయలో పడకుండా బిఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ హడావిడి చేస్తున్న కాంగ్రెస్ నేతలు, కర్నాటక పరిస్థితిపై ప్రశ్నిస్తే మాత్రం మొహం చాటేస్తున్నారు. కర్నాటక ఉదాహరణలు తెలంగాణ రైతాంగానికి కనువిప్పులా మారే పరిస్థితి కనపడుతుండటంతో కాంగ్రెస్ కంగారు పడుతోంది. కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు అంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కర్నాటక పరిస్థితి తెలంగాణలో తెచ్చుకోవద్దని ప్రజలకు హితవు పలుకుతున్నారు.

కాంగ్రెస్ నేతల అసమర్థతోనే కర్నాటక రైతులకు కష్టాలు: మంత్రి కెటిఆర్
కాంగ్రెస్ అసమర్ధతతోనే కర్నాటకలో విద్యుత్ కష్టాలు రైతులకు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత కరెంటు సరఫరా చేయడంలో విఫలమైందని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ అసమర్దత గురించి భాగా తెలుసునని, దశాబ్దాలుగా ఆబాధలు ఎదుర్కొన్నారని, ఇప్పడు కర్నాటకలో రైతులు ఆబాధలు అనుభవిస్తున్నారని కెటిఆర్ ట్విట్ చేశారు.

తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కర్నాటక ప్రభుత్వ ఆదర్శంగా తీసుకోవాలి ః కర్నాటక ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన విస్మరించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో సిఎం కెసిఆర్ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తూ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలను ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారి మాటాలను నమ్మకుండా బ్యాలెట్ ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News