Sunday, December 22, 2024

అశ్విన్‌కు గార్డ్ ఆఫ్ హానర్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల : టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా.. ఈరోజు మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అశ్విన్‌కు 100వ టెస్టు క్యాప్‌ను అందజేయగా మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్‌కు తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. భారత ఆటగాళ్లు ఇరువైపు నిలుచుని చప్పట్లతో అశ్విన్‌ను మైదానంలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా.. అశ్విన్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన విజయంలో కుటుంబం పాత్ర ఎంతో ఉందని, నాతో పాటు చెన్నయ్‌లో కూర్చొని ఉన్న ఓ వ్యక్తి కూడా ఇది భావోద్వేగ క్షణం. అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. చిన్నతనంలో నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టి నన్ను ముందు కూర్చోబెట్టుకొని కోచింగ్‌కు తీసుకెళ్లేవాడు. మా అమ్మ, తాత సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారని భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాకుండా.. నా భార్య ఈ రోజు వరకు నాకు మద్దతుగా ఉంది. నా ఇద్దరు పిల్లలు కూడా నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.’ అని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News