Sunday, January 19, 2025

అన్ని రంగాల్లో రాణిస్తున్న కాపులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మున్నూరుకాపులు అన్ని రంగాలలో గొప్పగా రాణిస్తున్నారని, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలలో బాగా స్థిరపడ్డారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. అయితే ఇంతటితో తృప్తి చెందకుండా, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఇంకా ఎంతగానో ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం మ్యాడం అంజయ్య ఆడిటోరియంలో వివాహ పరిచయ వేదిక నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే యువతకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం 20లక్షలు, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్షా 116 రూపాయలు ఉచితంగా అందిస్తున్నదని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు. మహాసభ సుమారు 95 ఏండ్లుగా మన కులానికి, సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన కాబోయే వధూవరులు,వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావుల నాయకత్వంలో ఎంపి రవిచంద్రకు మంగళ వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మున్నూరుకాపు ప్రముఖులు సుంకరి బాలకిషన్, మరికల్ పోత సుధీర్ కుమార్, ఈసంపల్లి వెంకన్న, కొండూరి వినోద్, లవంగాల వినో ద్, మణికొండ రమేష్, జితేందర్,సత్తేందర్, జైపా ల్ రెడ్డి, బిల్లకంటి రవికాంత్ రావు, ఆకుల రామారావు, రాగిశెట్టి శ్రీనివాస్, గోపాల రాధాకృష్ణ, ఆకుల సదానంద్, కొమ్ము శ్రీనివాస్, కైలాష్ రాకేష్, ఎస్పీ క్రాంతి కుమార్, మించు ఆనంద్ రావు, మ్యాడం రామేశ్వర రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News