Thursday, November 21, 2024

రోహిత్ స్థానంలో రాహుల్ ను తీసుకుంటాం: గంభీర్

- Advertisement -
- Advertisement -

మెరుగైన
ప్రదర్శన చేస్తాం
ప్రధాన కోచ్ గౌతం గంభీర్

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్షంగా పెట్టుకున్నట్టు టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. సిరీస్‌లో తాము అంచనాలకు మించి రాణించడం ఖాయమన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో ఓడినంత మాత్రాన తమను తక్కువ చేసి చూడడం సరికాదన్నాడు. ఎలాంటి స్థితినైనా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా భారత్‌కు ఉందన్నాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకుంటే జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడన్నారు. రోహిత్ స్థానంలో ఓపెనర్ గా కెఎల్ రాహుల్ తీసుంటామని స్పష్టం చేశారు.

సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఫామ్‌లకు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తారనే నమ్మకం ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాను ఓడించే అస్త్రాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయన్నాడు. ఏ జట్టుకైనా గెలుపోటములు సహాజమని, తమకు కూడా న్యూజిలాండ్ సిరీస్ ఇలాంటి ఫలితమే ఎదురైందన్నాడు. అయితే కివీస్ చేతిలో ఓడితే తాము ఒత్తిడిలో ఉన్నామని చెప్పడం సరికాదన్నాడు. కాగా, ఆస్ట్రేలియా సిరీస్‌కు బయలుదేరి వెళ్లే ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News