Wednesday, January 8, 2025

బిఆర్‌ఎస్‌కు మరో షాక్?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు వ రుసగా షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరగా తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి అగ్రనాయకులను మహిపాల్ రెడ్డి కలిసినట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారయినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఎన్నికల ఫలితాల తర్వాత పోచారం, సంజయ్ కుమార్ పార్టీలో చేరారు.

గూడెం మహిపాల్ కాంగ్రెస్‌లో చేరితే బిఆర్‌ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరుతుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులుచేశారు. అక్రమ మైనింగ్‌లో రూ.300 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఈడీ గుర్తించింది. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించాల్సిన మరో రూ. 39.08 కోట్లు ఎగవేసినట్టు ఈడీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News