Sunday, January 19, 2025

మేడారంలో గుడిమెలిగే పండుగ ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

మేడారం: ములుగు జిల్లా మేడారంలోని కన్నెపల్లిలో గుడిమెలిగే పండుగ ప్రారంభమైంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం మహాజాతర ప్రారంభానికి నాందిగా గుడిమెలిగే పండుగ చేస్తామని పూజారులు అని తెలిపారు. గుడిమెలిగే పండుగలో భాగంగా సమ్మక్క, సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో పూజారులు కప్పారు. సమ్మక సారలమ్మ జాతర ఉండడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్త జనసందోహంతో మేడారం నిండిపోయింది. పెద్ద ఎత్తున్న బంగారాన్ని సమ్మక సారలమ్మకు భక్తులు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి సదుపాయాలు కల్పించిందని భక్తులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News