Thursday, February 6, 2025

అప్పుడు చంద్రబాబు కోట్ల రూపాయల దర్వినియోగం: అమర్నాథ్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: రుషికొండ నిర్మాణాలపై త్రీమెన్ కమిటీ వేశామని, కమిటీ అంగీకరించిన తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని వైఎస్‌ఆర్‌సిపి నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత ప్రజాధనం వృథా చేశారని అందరికీ తెలుసునని చురకలంటించారు. సోమవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకునే సమయంలో బాబు ప్రైవేటు హోటల్ ఉండి రూ. కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎపి రాజధాని అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మించారని, కానీ వైసిపి అధినేత జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారని ప్రశంసించారు. టిడిపి నేతలకు ధైర్యముంటే వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. లేనిపోనివి అంటగట్టి ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News