Monday, January 20, 2025

కాపు జనసేన కాదు, కమ్మ జనసేన: గుడివాడ

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎపి అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ వద్ద గుడివాడ మాట్లాడారు. జెండా పవన్‌ది అజెండా టిడిపిదని, కాపు కులాన్ని మూటగట్టి బాబుకు అమ్మేయాలన్నదే పవన్ లక్షంగా పెట్టుకున్నారన్నారు. 175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్‌కు లేదని గుడివాడ చురకలంటించారు. పవన్‌ది కాపు జనసేన కాదు అని, కమ్మ జనసేన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలియదన్నారు. కాపు కులాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టాలని పవన్ తాపత్రయం కనిపిస్తుందని గుడివాడ విమర్శించారు. పవన్‌క స్థిరత్వం అనేది లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News