Wednesday, April 23, 2025

బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో బిజెపి నేత అనురాగ్ ఠాకూర్ సమక్షంలో పార్టీలో చేరారు. వరప్రసాద్ కు తిరుపతి లోక్ సభ టికెట్ ఇస్తామని బిజెపి అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఎఎస్ అధికారిగా పనిచేసిన వరప్రసాద్ 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News