Monday, January 20, 2025

వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా గుగులోతు లింగ్యా నాయక్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: వికారాబాద్ జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవిన్యూ)గా జి. లింగ్యా నాయక్ సోమవారం మధ్యాన్నం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పదోన్నతిపై వికారాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టారు. వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News