Monday, December 23, 2024

ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ గిర్ధవార్ సుహాసిని తెలిపారు. గురువారం మండలంలోని నాగారం పిఎస్ నెంబర్ 27, ఉమ్మాపూర్ పిఎస్ నెంబర్ 69, మహమ్మదాపూర్ పిఎస్ నెంబర్ 25,26 గ్రామంలోని ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన క ల్పించారు. ఎలక్షన్ కమిషన్ సూచనల ప్రకారం జిల్లా కలెక్టర్ అదేశానుసారం స్థానిక బెన్ షాలోమ్ ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని సుమారు 306 గ్రామాల్లో భాగంగా ప్రతి రోజు 3 గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. నియోజక వర్గంలోని అన్ని రాజకీయ ప్రజాప్రతినిధులు అధికారులు ఓటర్లు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సహాయకులు కరీం, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News