Sunday, December 22, 2024

బస్తీ, పల్లె దవాఖాన పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

Guidelines for filling Basti and Village Hospital posts

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పురపాలక సంఘాల పరిధిలోని సబ్ సెంటర్ల (బస్తీ దవాఖాన), పల్లె దవాఖానలో ‘మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్’ (ఎం.ఎల్.హెచ్.పి) పోస్టులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. బస్తీ , పల్లె దవాఖానల్లో ఎం ఎల్ హెచ్ పి పోస్టుల నియామకాలకు అర్హత మార్గదర్శకాలను పేర్కొంది. బస్తీ దవాఖానలోని పోస్టులకు ఎంబిబిఎస్/ బిఎఎంఎస్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని, ఎంబిబిఎస్‌కు ప్రాధాన్యత ఉంటోందని తెలిపింది. పల్లె దవాఖానలోని పోస్టులకు ఎంబిబిఎస్/ బిఎఎంఎస్‌తో పాటు స్టాఫ్ నర్సులు అర్హులుగా పేర్కొంది. బిఎస్సీ నర్సింగ్ 2020 తర్వాత పూర్తి చేసిన వారు, 2020కి ముందు బిఎస్సీ నర్సింగ్/ జిఎన్‌ఎం పూర్తి చేసి ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్టు (సిపిసిహెచ్) పూర్తి చేసిన వారు అర్హులు. బస్తీ, పల్లె దవాఖానల్లో పనిచేసే డాక్టర్లకు రూ.40 వేలు, స్టాఫ్ నర్స్‌కు రూ.29,900 గౌరవ వేతనం అందించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News