Sunday, November 17, 2024

లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకానికి మార్గదర్శకాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం రూ.500గ్యాస్ సిలిండర్ పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డు ప్రామాణికంగా అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్‌ను విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం పథకం అమలు ఎలా చేస్తారు? ఎవరు ఈ పథకానికి అర్హులు? వంటి కీలక వివరాలు తెలియజేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డి.ఎస్ చౌహాన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు కీలక అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారి లిస్ట్ ఆధారంగా రాష్ట్రంలో ఈ పథకం కింద 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు. ఈ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రకటించింది. మహిళల పైరుతో గ్యాస్‌కనెక్షన్ ఉన్న వారే ఈ పథకం కింద అర్హులుగా తెలిపింది.లబ్దిదారులు వంటగ్యాస్‌కోసం వినియోగిస్తున్న సిలిండర్లలో గత మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి ఇవ్వాల్సిన సిలిండర్లను కేటాయిస్తారు. వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తరువాత వినియోగదారుల బ్యాంకు ఖాతాలోకి తిరిగి సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు. గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సంస్థలకు ఇవ్వనుంది. సంస్థల నుంచి డైరెక్ట్ బిన్ఫిషియరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం మానిటరింగ్ చేయనుంది . భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కేవలం 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి సబ్సిడీ అమౌంట్ బదిలీ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేసినట్టు పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరి డి.ఎస్ చౌహాన్ ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గృహజ్యోతికి మార్గదర్శకాలు విడుదల
మన తెలంగాణ / హైదరాబాద్ : నిరుపేదల గృహాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహ జ్యోతి పథకాన్ని మంగళవారం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పధకం ద్వార అర్హత కలిగిన కుటుంబాలు వారు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొంద వచ్చు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకునేవారు తప్పనిసరిగా ప్రజాపాలన పోర్టల్ లేదా ఆమోదించబడిన ఛానెల్‌ల ద్వారా తమ దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా, దరఖాస్తుదారులు వారి గృహ సేవా కనెక్షన్ నంబర్‌తో పాటు వారి ఆధార్ కార్డ్‌తో, ఆహార భద్రతా కార్డ్ (తెల్ల రేషన్ కార్డ్) వివరాలను తప్పనిసరిగా అందించాలి.విద్యుత్ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రయోజనం లభిస్తుంది.200 యూనిట్ల వరకు వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలకు నెలవారీ బిల్లింగ్ జీరో ఛార్జీని ప్రతిబింబిస్తుంది, విద్యుత్ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. ప్రజాపాలనలో ఇప్పటికే నమోదు చేసుకున్న కుటుంబాల వారు ఈ పథకానికి అర్హత పొందుతారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఎంపిడివో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు లేదా జిహెచ్‌ఎచ్ సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుని మార్గదర్శకాల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News