లండన్: ఇంతకు ముందు ఎవరూ చేయని పని, సాహసకృత్యం వంటి వాటికి లభించే గుర్తింపే గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అయితే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 17న(నేడు) జరుపుకుంటుంటారు. ప్రపంచం ఏ మూలన జరిగే అరుదైన సంఘటన, సన్నివేశాన్ని గిన్నీస్ రికార్డులో నమోదుచేయడం జరుగుతుంటుంది. గిన్నీస్ రికార్డు బుక్ 100కు పైగా దేశాల్లో, 23 భాషల్లో ప్రచురితమవుతుంది. మొదటిసారి గిన్నీస్ రికార్డ్ డేను 2004 నవంబర్ 19న జరుపుకున్నారు. కొత్త రికార్డులు సృష్టించేందుకు, ఔత్సాహికులను ప్రోత్సాహించేందుకు ఈ దినోత్సవన్ని ఏటా జరుపుకుంటుంటారు. గిన్నీస్ రికార్డు పుస్తకం సృష్టికి కారణం గిన్నీస్ బ్రూవరీస్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ హ్యూ బీవర్. ఆయన యూరప్‌లో అత్యంత వేగవంతమై పక్షి ఏదని యోచించినప్పుడు రికార్డుల కోసం ఓ పుస్తకం అవసరమని గుర్తించాడు. ఆ తర్వాత క్రిస్టోఫర్ చాటవే ఆయనకు కూడా ఈ ఆలోచన నచ్చింది. దాంతో ఆయన సిఫార్సుచేయడంతో నోరిస్, రాస్ మెక్‌విర్టర్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును సంకలనం చేయడం మొదలెట్టారు. 1955 ఆగస్టు 27న 198 పేజీలతో 1000 కాపీల గిన్నీస్ రికార్డు బుక్ మొదటి ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చింది. గిన్నీస్ రికార్డు బుక్‌లో మన భారతీయులు కూడా చోటు సంపాదించారు. 30000పైగా పాటలు పాడిన ఎస్‌పి బాలసుబ్రమణ్యం, తక్కువ కాలంలో 750కు పైగా చిత్రాల్లో నటించిన హాస్యనటుడు బ్రహ్మానందం, ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల, ఏడు ఖండాలలోని ఏడు ఎత్తైన పర్వతాలను 172 రోజుల్లో అధిరోహించిన పర్వతారోహకుడు దివంగత మల్లి మస్తాన్‌బాబు వంటి వారు గిన్నీస్‌లో చోటు సంపాదించారు.
నేడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ‘డే’
- Advertisement -
- Advertisement -
- Advertisement -