Saturday, November 23, 2024

న్యూయార్క్‌లో యోగా గిన్నిస్ రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ వైరుద్ధాలను భారతీయ యోగా ప్రక్రియతో అంతమొందించుకోవచ్చునని, ఈ అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారతదేశం సర్వదా వసుధైక కుటుంబ నినాదాన్ని ప్రవచించింది. తన విలువల ప్రక్రియలతో ప్రపంచానికి తరాలుగా చాటిందని ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బుధవారం ప్రధాని తరఫున ఓ వీడియో సందేశం వెలువరించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉనన విషయం తెలిసిందే. ఆదరణ, ఆత్మీయతలను భారతదేశం తన సాంప్రదాయంగా మల్చుకుందని, పరస్పర వైరుద్ధాలను తొలిగించుకునేందుకు ఎల్లవేళలా పాటుపడాలనే జగద్విదిత నినాదం వెలువరించిందని తెలిపిన ప్రధాని ఈ దిశలో యోగా ఆచరణ ఓ సరైన మార్గం అన్నారు.

భారత్ ఎప్పుడూ వినూత్న ఆలోచనలకు ఆహ్వానం పలికింది. వాటిని రక్షించింది. ఈ విధంగా దేశం సుసంపన్న వైవిధ్యతను సంతరించుకుందని ప్రధాని మోడీ తెలిపారు. అంతర్గత త్రికరణశుద్ధిని, మనోతేజాన్ని విస్తరింపచేసే భావనలు యోగాతో ప్రదీప్తమవుతాయి. దీనితో మనను ఈ సహోదర భావంతో అనుసంధానం అయ్యేందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. ప్రాణికి ప్రేమ ప్రాతిపదికను యోగా కల్పిస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని జబల్పూరులో యోగా సంబంధిత జాతీయ ఉత్సవాన్ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ ఆవరణలో యోగా కార్యక్రమంలో కేంద్రం మంత్రులు ఇతరులతో కలిసి పాల్గొన్నారు. పలు రాష్ట్రాలలోని రాజధానులు , జిల్లా కేంద్రాలలో కూడా ఉత్సాహ భరితంగా యోగా వేడుకలు జరిగాయి. ఈసారి యోగాకు ప్రత్యేకత

ఆర్కిటిక్, అంటార్కిటికాల్లోనూ యోగా
ఈసారి యోగా కార్యక్రమానికి విశిష్టత ఉంది. ధృవ ప్రాంతాలు అయిన ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో అత్యంత క్లిష్టమైన చోట వెలిసిన భారతీయ పరిశోధనా కేంద్రాల్లోని మన పరిశోధకులు యోగాను జరిపారని, ఇది గర్వకారణం అని ప్రధాని మోడీ తమ వీడియో సందేశంలో తెలిపారు. మనందరి మనస్సులను కలిపే వారధి యోగా అని పేర్కొన్నారు.

న్యూయార్క్‌లో యోగా గిన్నిస్ రికార్డు
ఈసారి 135 దేశాల ప్రాతినిధ్యం
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ స్థాయిలో గిన్నిస్ రికార్డుల్లోకి చేరింది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమానికి ఈ సారి 134 దేశాల వారు హాజరయ్యారు. ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్షణగా సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు రికార్డును ఛేదించింది. ఇంతకు ముందు ఏడాది ఈ యోగా దినోత్సవానికి 114 దేశాల వారు హాజరుకాగా ఇప్పుడు దీనికి 135 దేశాల ప్రతినిధులు వచ్చారని, ఇది రికార్డు అని ఐరాస తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News