Friday, March 7, 2025

ప్రపంచ అత్యంత వృద్ధ క్షురకురాలికి గిన్నీస్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళా క్షురకురాలు. ఆమె వయసు 108 సంవత్సరాలు. బక్కపలచని, తెల్లటి నెరసిన జుట్టు ఉన్న ఆ జపనీస్ మహిళకు తన పని నుంచి విరమించాలన్న ఆలోచనే లేదు. ఈ వారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా అధికారిక గుర్తింపు లభించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని షిట్సుయ్ హకోయిషి తెలిపింది. ఆమె కస్టమర్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు బుధవారం అంతర్జాతీయ ఫ్రాంచైజీ నుండి అధికారిక సర్టిఫికేట్ అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పురుష క్షురకులకు ప్రత్యేక కేటగిరీ ఉంది. అయితే 2018లో 107 సంవత్సరాల వయసులో సర్టిఫికేట్ పొందిన అమెరికాకు చెందిన ఆంథోనీ మాన్సినెల్లి మరణించడంతో,

హకోయిషి ఈ రికార్డుకు ఏకైక హోల్డర్‌గా మిగిలిపోయింది. షిట్సుయ్ హకోయిషి తొమ్మది దశాబ్దాలుగా క్షురకురాలిగా పనిచేస్తోంది.‘నా కస్టమర్ల చలువ వల్లే నేను ఇన్నాళ్లు ఇంత దూరం రాగలిగాను’ అని ఆమె అన్నది. నకగావాలో రైతు కుటుంబంలో 1916 నవంబర్ 10న ఆమె జన్మించింది. తన 20 ఏళ్లకే ఆమె క్షురకురాలిగా తన లైసెన్సు పొందింది. ఆమె భర్త 1937లో జపాన్‌చైనా యుద్ధంలో చనిపోయాడు. వారికి ఇద్దరు పిల్లలు. అమెరికా 1945 మార్చి 10న టోక్యోపై వేసిన బాంబులో ఆమె సెలూన్ కూడా ధ్వంసం అయిపోయింది. దాంతో ఆమె, ఆమె పిల్లలు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టారు. ‘ఈ ఏడాది నాకు 109 ఏళ్లు, నేను 110 వచ్చే వరకు బతికే ఉంటాను’ అని ఆమె నవ్వుతూ ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News