- Advertisement -
అహ్మదాబాద్ : రైలు వ్యాగన్పైకెక్కి సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ షూటింగ్ చేస్తున్న బాలుడు కరెంట్షాక్తో మృతి చెందాడు. 15 ఏళ్ల ప్రేమ్ పంచల్ అహ్మదాబాద్ సబర్మతి యార్డ్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం గూడ్సురైలు వ్యాగన్ ఎక్కి వీడియో షూటింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రేమ్ రాణిప్ ఏరియా నుంచి తన స్నేహితునితో కలసి అక్కడకు వచ్చాడని, కరెంట్ షాక్తో అక్కడికక్కడే కింద పడిపోయాడని రైల్వే పోలీసులు చెప్పారు. పంచల్ ఇన్స్టాగ్రామ్ కోసం తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేయడానికి వ్యాగన్ పైకి ఎక్కాడని పంచల్ స్నేహితుడు చెప్పాడు. రైల్వే పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -