Monday, December 23, 2024

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితాను విడుదలచేసిన బిజెపి

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: ఈ ఏడాడి డిసెంబర్‌లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(బిజెపి) గురువారం తన అభ్యర్థుల జాబితా (160 మంది పేర్లు) విడుదలచేసింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ జాబితాను గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండ్‌వియా సమక్షంలో విడుదల చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. ఇక గుజరాత్‌లోని పటిదార్ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ వీరమగమ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు.

గుజరాత్‌లో 182 సభ్యుల అసెంబ్లీకి జరుగనున్న రెండు దశల ఈ ఎన్నికల డిసెంబర్ 1 నుంచి 5 వరకు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగనున్నది. ఈసారి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, సీనియర్ నాయకులు భూపేంద్ర సిన్హా ఛుదసమ, నితిన్ పటేల్ పోటీచేయబోవడంలేదు. రూపాని 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రివబ జడేజా (రవీంద్ర జడేజా భార్య) జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా హాజరైన ఎన్నికల కమిటీ మీటింగ్‌లో అధికార నాయకులు విస్తృత చర్చలు జరిపిన తర్వాతే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News