Thursday, March 20, 2025

పాక్‌కు దేశ రహస్యాలు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కాన్పుర్: పాకిస్థాన్‌కు చెందిన గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి దేశ రక్షణ రహస్యాలు చేరవేస్తున్నడన్న ఆరోపణలపై కాన్సుర్‌ ఆర్డినెన్స్ ఫ్యాకర్టీ ఉద్యోగులను ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ వర్క్ మేనేజర్‌గా చేస్తున్న కుమార్ వికాస్ పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్‌తో కుట్ర చేస్తున్నట్లు సమాచారం తెలుసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

2025 జనవరిలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఏజెంట్ నేహాశర్మ పేరుతో అతనితో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. తాను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బిహెచ్ఇఎల్) ఉద్యోగి అని పరిచయం చేసుకుంది. తమ కంపెనీకి చెందిన సున్నిత విషయాలను చెప్పాలని.. అందుకు డబ్బులు కూడా ఇస్తానని ఆశ చూపింది. అంతేకాక.. అతనికి వలపు వల విసిరింది. దీంతో అతను లూడో అనే గేమ్ సహాయంతో ఆమెకు సమాచారం అందించడం ప్రారంభించాడు. సున్నితమైన పత్రాలు, మందుగుండు సామాగ్రి ఉత్పత్తికి సంబంధించిన డేటా, పరికరాల వివరాలు, ఉద్యోగుల సమాచారం వంటివి లీక్ చేశాడు. లీక్‌ చేసిన సమాచారం వల్ల భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదే నేహాశర్మకు సమాచారం అందిస్తున్న పెరోజాబాద్‌కి చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెకానిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి కూడా నేహాశర్మ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయిందని అనంతరం అతనికి వలపు వల విసిరి దేశ రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని, లేఖలను తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News