Sunday, January 19, 2025

గుజరాత్‌లో పోటీ నుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన ఇద్దరు బిజెపి లోక్‌సభ అభ్యర్తులు వ్యక్తిగత కారణాలతో తాము పోటీ చేయలేమని శనివారం ప్రకటించారు. వడోదర, సబర్‌కాంత నియోజకవర్గాలకు చెందిన బిజెపి అభ్యర్తులు తమ నిరాసక్తతను వెల్లడించారు. వడోదర స్థానానికి చెందిన సిట్టింగ్ ఎంపి రంజన్ భట్‌ను మరోసారి అభ్యర్థిగా బిజెపి నిర్ణయించింది. అయితే తాను పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని ఆమె ప్రకటించారు. రంజన్ భట్ అభ్యర్థిత్వాన్ని బిజెపిలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ప్రకటన వచ్చిన కొద్ది గంటలకే సబర్‌కాంత్‌కు చెందిన బిజెపి అభ్యర్థి భికాజీ ఠాకూర్ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఖాళీ చేసిన లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రంజన్ భట్ పోటీ చేసి గెలుపొందారు. 2019లో కూడా ఆమె అదే స్థానం నుంచి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం బిజెపి ఆమెకు అదే స్థానాన్ని కేటాయించింది. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 ఎన్నికలలో బిజెపి గుజరాత్‌లోని అన్ని స్థానాలను గెలుచుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News