Wednesday, April 2, 2025

గ్యాంబ్లింగ్ కేసులో గుజరాత్ బిజెపి ఎమ్మెల్యేకు 2 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Gujarat BJP MLA jailed for 2 years in gambling case

హలోల్(గుజరాత్): గ్యాంబ్లింగ్ కేసులో అరెస్టయిన బిజెపి ఎమ్మెల్యే కేసరిసింహ్ సోలంకితోపాటు మరో 25 మందికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాకు చెందిన హలోల్ మెజిస్టీరియల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది జులై 1వ తేదీ రాత్రి పంచ్‌మహల్ జిల్లాలోని శివరాజ్‌పూర్‌లోగల ఒక రిసార్ట్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ సోలంకితోపాటు 25 మంది పోలీసులకు చిక్కారు. వీరిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. అందులో నలుగురు నేపాలీ జాతీయులు ఉన్నారు. నిందితులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 3,000 జరిమానా విధిస్తూ అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ్ హంసరాజ్ సింగ్ బుధవారం తీర్పు చెప్పారు. నిబంధనలకు అతిక్రమించి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఆ రిసార్ట్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. రిసార్ట్‌పై గత ఏడాది పోలీసులు దాడి చేసిన సందర్భంలో రూ. 3.9 లక్షల నగదు, ఎనిమిది వాహనాలు, 25 మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News