అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో వంతెన ప్రమాదంలో మృతుల సంఖ్య వంద దాటింది. మోర్బీ వద్ద మచ్చూ నదిపై తీగల వంతెన కూలింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నదిలో పడిని పలువురిని సహాయ సిబ్బంది, పోలీసులు కాపాడారు. ప్రమాద సమయంలో వంతెనపై 500 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తీగల వంతెనపై కొందరు యువకులు ఆకతాయి చేష్టలు చేసినట్లు గుర్తించారు. వంతెన ఆదునికీకరణ పనులు పూర్తి చేసిన ఐదు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ప్రధాని మోడీ సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని ఆదేశించారు. గాంధీనగర్, వడోదర నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గుజరాత్ లో కూలిన వేలాడే వంతెన బ్రిటిష్ కాలం నాటిది. 7 నెలలు మరమ్మతుల తర్వాత ఈ నెల 26న ఈ వంతెనను తెరిచారు. నాలుగు రోజుల నుంచే వంతెన మీదకు సందర్శకులకు అనుమతిచ్చారు. సెలవు దినాలు కావడంతో వంతెనపై పర్యాటకుల రద్దీ పెరిగింది.