Monday, December 23, 2024

గుజరాత్‌లో అధికారిక కార్యక్రమాల వాయిదా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంతాప సూచకంగా శనివారం గుజరాత్ లోని అన్ని అధికారిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి భూపేంద్ర బఘేల్ వాయిదా వేశారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను కూడా రద్దు చేయడమైందని సిఎం చెప్పారు.

అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి నారాయణ రాణే పాల్గొనాలనుకున్న వాణిజ్య సదస్సు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాలు రద్దయ్యాయి. ముఖ్యమంత్రి బఘేల్ శనివారం సర్మదా సుగర్ వేడుకల్లోను, నర్మదా జిల్లాలో ఎరువుల ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోను ఖేదా జిల్లా వడ్‌తల్ వద్ద అఖిల భారత సంత్ సమితి విభాగం సదస్సు లోనూ ముఖ్యమంత్రి బఘేల్ పాల్గొనాల్సి ఉండగా అవన్నీ రద్దయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News