Friday, December 27, 2024

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ను హతమార్చేందుకు టెర్రరిస్ట్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలోని పాతబస్తిలో ఎంఎల్‌ఎగా ఉన్న రాజాసింగ్ హిందూ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనను అనేక సార్లు హతమార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీంతో, ప్రభుత్వం ఎంఎల్‌ఎ రాజా సింగ్‌కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆయనను హతమార్చేందుకు ఓ తీవ్రవాది పథకం వేశాడు. ఎంఎల్‌ఎ రాజాసింగ్‌తో పాటు, ఢిల్లీ మాజీ బిజెపి నేత నుపుర్ శర్మను హత్యకు ఉగ్రవాది ప్లాన్ చేశాడు.

మౌలానా సోహైల్ అబును గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోహైల్ దారాల పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేస్తూ, ఆ ప్రాంతంలోని ముస్లిం పిల్లలకు ఇస్లాంపై ట్యూషన్ చెబుతుంటాడు. ఈ క్రమంలోనే భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు నిందితుడికి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు, డబ్బులు వచ్చేవని పోలీసులు వెల్లడిం చారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News