Monday, December 23, 2024

కెసిఆర్ రావాలి..బిజెపి పోవాలి

- Advertisement -
- Advertisement -

Gujarat former CM Meets CM KCR

మీ నాయకత్వం దేశానికి అవసరం
బిజెపి దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టాలి
ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతున్న మోడీ
ఇలాగే చూస్తూ ఊరుకోవడం ప్రజాస్వామిక వాదులకు తగదు
బిజెపిని ఢీకొనే సరైన నేత లేక ఇంతకాలం మదనపడ్డాం
ఇప్పుడు మీ రాకతో ఆ లోటు భర్తీ
సమరశంఖం పూరించండి.. మీవెంట మేముంటాం: వాఘేలా

మన తెలంగాణ/హైదరాబాద్: రావు సాబ్.. జాతీయ రాజకీయాల్లో మీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ జాతీయ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. దేశంలోని భావసారూప్య విపక్షాలను కలుపుకుపోయేందుకు మీరు ముందుండాలన్నారు. మీ నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న బిజెపి దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వా ఘేలా పేర్కొన్నారు. అందుకు దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మీరు సాధ్యమైనంత త్వరగా జాతీయ రాజకీయాల్లోకి రావాలని, మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నానని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌తో వాఘేలా సమావేశమయ్యారు. సుమారు ఐదు గంటల పాటు ఎంతో సుహృద్భావ వాతావరణంలో సాగిన సమావేశంలో పలు జాతీయ స్థా యి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా తెలంగాణ
సాధించిన ప్రగతితోపాటు దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులు జాతీయ అంశాలపై ప్రదానంగా చర్చసాగింది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపరీత పోకడలతో అనుసరిస్తున్న స్వార్థ రాజకీయ క్రీడ దేశ ప్రజలపై దాని పర్యవసానాల పై ఇరువురు నేతలు దృష్టిసారించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ వంటి సీనియర్ జాతీయ నేతలంతా నేటి బిజెపి రాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నామని వాఘేలా అన్నారు. ప్రధాని మోడి అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలనా, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని మండిపడ్డారు. ఇటువంటి కీలక సందర్భంలో మౌనం వహించడం ప్రజాస్వామిక వాదులకు, దేశ ప్రగతి కాములకు తగదని వాఘేలా అన్నారు.
ఫెడరల్ స్పూర్తిని మంటగలుపుతున్న మోడీ
దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్పూర్తిని మోడీ ప్రభు త్వం మంటగలుపుతోందని వాఘేలా ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలో ఒక నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నదన్నారు. దీనిని ఇట్లానే చూస్తూ ఊరుకోలేక, నిలువరించే దిశగా సరియైన వేదిక దొరకక, తమలాంటి సీనియర్లను ముందుండి నడిపించే నాయకత్వం లేక కొంత ఆందోళనతో ఉన్నామన్నారు. ఇలాంటి సమయంలో మీ రు చీకట్లో చిరుదీపంగా మారన్నారు. కేంద్ర విధానాల ను మీరు ప్రతిఘటిస్తున్న తీరు తమవంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసిందని వాఘేలా కెసిఆర్‌తో అన్నారు.
పట్టిన పట్టు విడవని నాయకుడిగా మీకు గుర్తింపు
అనుకున్న దానిని సాధించేవరకు, పట్టిన పట్టు విడవని నాయకుడుగా మిమ్మల్ని(కెసిఆర్) ఇప్పటికే దేశం గుర్తించిందని వాఘేలా అన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణను ఎన్నో కష్టాలకు, నష్టాలకోర్చి శాంతియుత పంథాలో పార్లమెంటరీ రాజకీయ పంథా ద్వారా సాధించడం దేశ చరిత్రలో గొప్ప విషయమన్నారు. సాధించిన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తూ అనతికాలంలోనే అప్రతిహతంగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్ర దేశంలో ఇంతటి ఘన చరిత్ర మీది మాత్రమేనని అన్నారు. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మిమ్మల్ని అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసిందని వాఘేలా విమర్శించారు. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో ముందుకు పోతున్న మీ తెగువ నిజంగా మహోన్నతమైనదన్నారు. మిమ్మల్నే కాకుండా దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని భయ భ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణులద్వారా లొంగదీసుకోవాలనే కుట్రలను బిజెపి అమలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
బిజెపి పాలనకు చరమగీతం పాడాల్సి ఉంది
దేశంలో మత సామరస్యానికీ, ప్రాంతీయ సామరస్యానికీ విఘాతం కలిగిస్తున్న లౌకిక వాద, సమాఖ్యవాద వ్యతిరేక కేంద్ర బిజెపి పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాల్సి ఉందని సిఎం కెసిఆర్‌తో వాఘేలా అన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ పీడన నుంచి తెలంగాణ తో పాటు సహచర రాష్ట్రాల ప్రజలను విముక్తం చేయాల్సిన అవసరం మీకున్నదని తమలాంటి సీనియర్లమందరం భావిస్తున్నామన్నారు.
తామంతా నిర్ణయించుకునే మీ దగ్గరకు వచ్చాను
మోడీ ప్రభుత్వానికి మీ సారథ్యంలో తగు గుణంపాఠం చెప్పాలని తామంతా కోరుకుంటున్నామని వాఘేలా అన్నారు. దీనిపై తాము కలిసి నిర్ణయించుకున్న తర్వాతే మీతో సమావేశం కావడానికి హైదరాబాద్‌కు వచ్చినట్లు కెసిఆర్‌కు వివరించారు. ఇంకా చెప్పాలంటే వారంతా కలిసేందుతు తనను మీవద్దకు పంపారన్నారు. మీకు మా అందరి ఔట్ రైట్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాల్సిందిగా కోరుతున్నామన్నారు. అందుకు మిమ్మల్ని మరోమారు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.
గుణాత్మక మార్పు తేవడానికి తన వంతు కృషి
వాఘేలా ఆహ్వానానికి ఈ సందర్భంగా కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను ముఖ్యమంత్రిగా ముందుకు నడిపిస్తూనే, దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పును తేవడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకులు తనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తన నాయకత్వాన్ని సమర్థించడం పట్ల వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని సిఎం అన్నారు.

Gujarat former CM Meets CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News