Friday, April 4, 2025

గుజరాత్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ సీజన్ 2023లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ 38-32 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో పట్టు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ టీమ్‌లో సోను జగ్లన్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. అద్భుత ఆటతో అలరించిన సోను టైటాన్స్ ఆటగాళ్లను హడలెత్తించాడు. నబి బక్ష్ 4, ఫజల్ మూడు పాయింట్లు సాధించారు. ఇక తెలుగు టైటాన్స్ టీమ్‌లో పవన్ షెరావత్ అత్యధికంగా 10 రైడింగ్ పాయింట్లను నమోదు చేశాడు. సంజీవ్ 5 పాయింట్లను సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో టైటాన్స్ ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News