Monday, December 23, 2024

గుజరాత్ అభయారణ్యం అద్భుతం: ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

Gujarat gir forest awesome
మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్‌లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవం అని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జైరామ్ రమేష్ అధ్యక్షతన ఎంపి సంతోష్ గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. నేషనల్ పార్క్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సింహం ఫోటోలను ఎంపి సంతోష్ తన కెమెరాలో బంధించారు. నేషనల్ పార్క్ సందర్శనలో మంత్రముగ్ధులను చేసే ఎన్నో జ్ఞాపకాలు కలిగి ఉన్నాయి. వాటి జ్ఞాపకార్థం తీసిన అద్భుతమైన చిత్రాలు ఇవి అంటూ ట్విట్టర్‌లో ఎంపి సంతోష్ పోస్ట్ చేశారు.

అభిమానులకు, ప్రజలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ వినూత్న పిలుపు

తన జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు వెస్ట్ మారెడ్‌పల్లిలోని నెహ్రూ వాకర్ పార్కులో తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు కొన్నికోట్ల మొక్కలను నాటడం జరిగిందని..తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కానీ గ్రీనరీతో రాష్ట్రం కళకళలాడుతోందన్నారు. రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటాలి. ఇంకో ముగ్గురు మొక్కలు నాటాలని పిలుపునివ్వాలని అభిమానులకు, ప్రజలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

తన 50వ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు హైదరాబాద్ నాగోల్‌లో తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చెప్పారు. సిఎం కెసిఆర్ మానస పుత్రికైన తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో చేపట్టినకార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప వరంలా భావిస్తున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News