Friday, November 22, 2024

గుజరాతీ అమ్మాయికి అద్భుతమైన సర్జరీతో కొత్త చేయి పెట్టారు!

- Advertisement -
- Advertisement -

ముంబై: గుజరాత్‌కు చెందిన టీనేజ్ అమ్మాయికి పుట్టుకతోనే ఓ చేయి సరిగాలేదు(కాంజెనిటల్ హ్యాండ్ అప్లాసియా). ఇప్పుడామెకు సర్జరీ ద్వారా కొత్త చేయి పెట్టారు. ముంబై గ్లోబల్ హాస్పిటల్‌లో సర్జరీకి 13 గంటల సమయం పట్టింది. గుజరాత్‌లోని భరూచ్‌కు చెందిన సమీయా మన్సూరీ(18) పుట్టుకతోనే చేయి, వేళ్ల సమస్యలతో పుట్టింది. దాంతో ఆమె ఓ చేయి సరిగా పెరగలేదు. ఒక చేయికి పూర్తి అవలక్షణాలు ఏర్పడ్డాయి. ‘ఆమె ముంచేయి, అరచేయి లోపాలతో ఉన్నాయి. ఆమె వ్రేళ్లు చిన్నగా ఉండేవి, ఆమె రక్త నాళాలు, కండరాలు, ఎముకలు , నరాలు వంటివన్నీ చిన్నవిగా ఉండేవి’ అని గ్లోబల్ హాస్పిటల్‌కు చెందిన ప్లాస్టిక్ సీనియర్ కన్సల్టెంట్, హ్యాండ్ అండ్ రీకన్స్‌ట్రక్టివ్ మైక్రోసర్జన్ డాక్టర్ నీలేశ్ సత్‌భాయ్ తెలిపారు. ఆయన ఆపరేషన్ టీమ్‌కు నేతృత్వం వహించారు.

దీనికి ముందు ఆమె కుటుంబం వివిధ ఆసుపత్రులకు చికిత్స కోసం తిరిగింది. చివరికి డాక్టర్ సత్‌భాయ్‌ను కలిసింది. ఇండోర్‌కు చెందిన 52 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ మహిళ చేయిని ఆమెకు ఆపరేషన్ ద్వారా అతికించారు. దేశంలోనే మొదటిసారి ఒకరి చేతిని మరొకరికి అమర్చడం ఇదే మొదటిసారి అని డాక్టర్ సత్‌భాయ్ గర్వంగా చెప్పారు. కొన్ని ఎక్సర్‌సైజ్‌ల తర్వాత సమీయా కొత్త చేయి 90 శాతం బాగా పనిచేయగలుగుతుందని ఆయన తెలిపారు. ఆమె చేయి బాగా పనిచేయగలిగేలా మారడానికి కనీసం సంవత్సరం పడుతుందని డాక్టర్ సత్‌భాయ్ తెలిపారు. అవలక్షణాలతో పుట్టే వారికి ఈ ఆపరేషన్ ఓ ఆశాకిరణం కాగలదన్నారు. ఆపరేషన్ విజయవంతమయ్యాక సమీయా కేక్ కట్‌చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఇప్పుడిప్పుడే తన కొత్తగా అతికించిన చేయిని మెల్లిమెల్లిగా పైకి లేపగలుగుతోంది. మీడియాకు కూడా చూయించింది. సమీయా తల్లి తన కూతురుకి చేయిని దానం చేసిన ఆ డోనర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది. వైద్య బృందం ‘అద్భుతం’ చేసి తన కూతురుకి చేయిని అమర్చిందని, ఇదో మైలురాయి అని ప్రశంసించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News