Thursday, January 23, 2025

హిందువులను ‘అతిపెద్ద మతోన్మాదులు’గా అభివర్ణించిన గుజరాత్ గవర్నర్

- Advertisement -
- Advertisement -

 

Gujarat Governor Devvrath

గాంధీనగర్: హిందువులను కపటులు అంటూ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. నర్మెట జిల్లా పోయిచా గ్రామంలో బుధవారం ‘ప్రకృతి ఒడిలో సేంద్రియ వ్యవసాయం’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వివాదస్పద వ్యాఖ్య చేశారు.  రాష్ట్రానికి చెందిన రెండు ప్రముఖ వార్తాపత్రికలు గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను ఉటంకిస్తూ ఇలా పేర్కొన్నాయి: “ప్రజలు ‘జై గౌ మాతా’ అని జపిస్తారు, కానీ  పాలిచ్చేంత వరకే వాటిని తమ దొడ్డిలో కట్టి ఉంచుతారు.  పాలు ఇవ్వడం ఆపివేస్తే, వారు వాటిని రోడ్లపై వదిలివేస్తారు. అందుకే నేను హిందువులు నంబర్ 1 కపటులని అంటున్నాను. హిందువులు, గోవులు పరస్పర అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడ జనులు కేవలం తమ స్వార్థం కోసం ’గోమాత‘ అంటూ జపిస్తారు’’ అన్నారు.

ఆయన ఇంకా ఇలా చెప్పుకొచ్చారు: “ప్రజలు దేవుణ్ణి ప్రార్థించడానికి దేవాలయాలు, మసీదులు, చర్చి, గురుద్వారాలను సందర్శిస్తారు, తద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీరు సేంద్రీయ వ్యవసాయానికి తిరిగి వస్తే, దేవుడు ఆటోమేటిక్ గా మీతో  సంతోషంగా ఉంటాడని నేను ప్రకటిస్తున్నాను. . రసాయనిక ఎరువులు వాడి పశువులను చంపేస్తున్నారని శాస్త్రీయ ఆధారాలతో చెబుతున్నాను. మీరు సేంద్రియ వ్యవసాయానికి వెళితే, మీరు పశువులకు జీవం పోస్తారు.’’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News