Saturday, January 25, 2025

రాహుల్ విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీ అప్పీల్ విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి గీతాగోపి తప్పుకున్నారు. రాహుల్ తరఫున న్యాయవాది పిఎస్ చంపనేరి కేసును అత్యవసరంగా విచారించాలని జస్టిస్ గీతాగోపిని కోరారు. విచారణ నుంచి తను తప్పుకున్నట్లు బుధవారం న్యాయమూర్తి తెలిపారు. రాహుల్ గాంధీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

కేసు విచారణ ఇతర కోర్టుల ముందు ఉంచడానికి ప్రధాన న్యాయమూర్తికి నోట్ పంపనున్నట్లు తెలిపారు. మోడీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 2019న గుజరాత్ బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేష్ మోడీ కేసు దాఖలు చేశారు. పరువునష్టం కేసులో సూరత్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 23న రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఎంపిగా అనర్హత వేటుకు గురైన రాహుల్‌గాంధీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News